KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్గా ఆదూరి విజయకృష్ణ నియమితులయ్యారు. 20 మంది సభ్యులు కూడా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయకృష్ణ మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారం, మార్కెట్ అభివృద్ధి, సౌకర్యాల విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు.