అనంతపురంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వర్గీయ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. అనంతరం ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.