TG: హైదరాబాద్ మణికొండలోని విద్యుత్ శాఖ ADE అంబేడ్కర్‌తో పాటు అతని బినామీల ఇళ్లపై ACB సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో 18 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ADE బినామీ సతీశ్ ఇంట్లో రూ.2 కోట్ల నగదును పట్టుకున్నారు. అలాగే అంబేడ్కర్‌కు రూ.200 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించిన అధికారులు భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.