KMM: ముదిగొండ మండలం చిన్నమండవకు చెందిన గురవయ్య అనే వ్యక్తి తన ఇల్లు కాలిపోయిందని, ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ 30KM సైకిల్‌పై ప్రయాణించి కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో గురవయ్య గుడిసె పూర్తిగా కాలిపోయింది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని,ప్రయాణానికి కూడా డబ్బులు లేకపోవడంతో సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చానని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.