WGL: వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందుల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో 72 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు రోగులకు అందుబాటులో ఉండవు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.