NLG: నకిరేకల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కాగా, ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయనతోపాటు పార్టీ నాయకులు చామల శ్రీనివాస్, మాద యాదగిరి, పన్నాల రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.