కృష్ణా: గుడివాడలో జరిగిన అండర్ 20 ఓపెన్ చెస్ పోటీలలో ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచారు. అండర్ 16లో తీరానంద్ నందకిషోర్, అండర్ 14లో ప్రవల్లిక, కందన ప్రియ, అండర్ 9లో దేవాన్ష్, శ్రీ రెడ్డి, అండర్ 8లో సుజిత్ జోగి, షేక్ తౌఫిక్,అండర్ 7లో నాగసాయి, ఆధ్యారాయ్ విజయం సాధించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఛైర్మన్ వారిని మంగళవారం అభినందించారు.