కీర్తి చక్ర అవార్డు గ్రహీత మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఆ గొప్ప సైనికుడు తన అభిమానిని కావడం గర్వంగా ఉందన్నారు. చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం ఆయన చేసిన వీరోచిత పోరాటం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. నాయుడు, ఆయన కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.