VSP: జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని కోరుతూ.. జర్నలిస్టు సంఘాల జేఏసీ ప్రతినిధులు విశాఖలోని పలువురు ఎమ్మెల్యేలకు మంగళవారం వినతిపత్రాలు సమర్పించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌లను కలిసి సమస్యలను వివరించారు.