KDP: ఖాజీపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో, సీ.ఐ వంశీధర్ దుకాణదారులకు పలు సూచనలు చేశారు. తమ దుకాణాల ముందు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలపకుండా, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతి దుకాణదారుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.