KDP: తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వెనక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు సమాచారం.