KRNL: నెల్లూరు జిల్లా గండ్లవీడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల సైట్ ఇంజినీర్ విజయకుమార్ సెప్టెంబరు 17 నుంచి కనిపించకుండా పోయారు. సుంకేసుల డ్యాం వద్ద కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న ఆయన అదృశ్యంపై మేనమామ నాగేశ్వరరావు శుక్రవారం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై చిరంజీవి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.