KNR: గన్నేరువరం మండలం చొక్కారావుపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ వాహనానికి ఎస్కార్ట్ వస్తున్న మారుతీ స్విఫ్ట్ కారును కూడా పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక డంప్ చేసి, సిద్దిపేటకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.