VZM: గో సంరక్షణ సమితి విజయనగరం వారు కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గో విజ్ఞాన పరీక్ష నిర్వంచగా 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీపురుపల్లి ఈశ్వర రావు నగదు బహుమతి అందించారు. ఇందులో గో సంరక్షణ సమితి విభాగ ప్రచారక్ రమేష్, తెలుగు ఉపాధ్యాయులు డా.గోవింద నాయుడు పాల్గొన్నారు.