KMR: చొప్పదండి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఆర్నకొండ నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు కేంద్రం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, కొండగట్టు, వేములవాడ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.