TG: హైదరాబాద్ మియాపూర్ డిపోలో విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం డ్యూటీకి వచ్చిన కండక్టర్ పండరి.. వాష్ రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలాడు. గమనించిన తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అంత సేపు తమతో సరదాగా మాట్లాడిన పండరి మృతిచెందడంతో తోటి ఉద్యోగులు షాక్ అయ్యారు. దీంతో డిపోలో విషాదఛాయలు అలుముకున్నాయి.