కోనసీమ: అమలాపురం మండలం బండారులంక గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యపై లిబరేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ బొజ్జ ఐశ్వర్య సోమవారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో డంపింగ్ యార్డు లేకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు.