TG: విద్యార్థుల భవిష్యత్తుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని ఆయన తెలిపారు. ఫీజు బకాయిల కోసం తక్షణమే రూ. 600 కోట్లు విడుదల చేస్తున్నామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.