SRD: కార్మిక కార్డులు పొందడానికి భవన నిర్మాణ రంగా కార్మికులు మాత్రమే అర్హులని నారాయణఖేడ్ కార్మిక శాఖ సహాయ అధికారి యాదయ్య తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తాపీ, సెంట్రింగు, టైల్స్ మేస్త్రీలు, కార్పెంటర్లతోపాటు వారి కింద కూలీ పనులు చేసేవారు, మట్టి పని, ఇసుక క్వారీలు, ఇటుక బట్టీలో పనిచేసేవారు అర్హులని వివరించారు.