AP: డీఎస్సీ తుది జాబితాలో పేరు లేని అభ్యర్థులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధైర్యం చెప్పారు. ఇకపై ఏటా డీఎస్సీ ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వేలాది మంది అభ్యర్థులకు కొత్త ఆశలు నింపిందని తెలిపారు. ఈసారి అవకాశం రాని అభ్యర్థులు మరింత కష్టపడి తర్వాత నిర్వహించబోయే డీఎస్సీలో చోటు దక్కించుకోవాలని సూచించారు.