ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE విజయం సాధించడంతో భారత్‌కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే UAE, పాక్‌లపై గెలుపొందిన టీమిండియా.. 4.793 మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు చేరుకుంది. రెండో బెర్త్ కోసం పాక్, UAE మధ్య పోటీ నెలకొంది.