తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెంక్షన్ ఇస్తామని టీడీపీ, జనసేన కలిసి ప్రకటించాయి. ఈ మేరకు జయహో బీసీ సభలో మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి విడుదల చేశారు.
BC Declaration Meeting : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెంక్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రకటించారు. ఈ మేరకు వారు మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో డిక్లరేషన్ని విడుదల చేశారు. అలాగే పెంక్షన్ని రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ సభలో పది అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్‌ను(BC Declaration) వీరిరువురూ కలిసి విడుదల చేశారు. అవేంటంటే..
1. పెంక్షన్ నెలకు 4 వేలకు పెంపు. బీసీలకు 50 సంవత్సరాలకే పెంక్షన్.
2. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు. ఇలాంటి వాటి నుంచి బీసీలకు ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకురావడం.
3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు.
4.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం 34 నుంచి 24 శాతానికి తగ్గించింది. తాము అధికారంలోకి వస్తే మళ్లీ 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం.
5. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు.
6. చట్టబద్ధంగా కుల గణన.
7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరద్ధరణ. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు.
8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు.
9. విద్యా పథకాలు అన్నీ పునరుద్ధరణ.
10. బీసీ భవనాలు, కమ్యునిటీ హాళ్ల నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం.