KKD: శంఖవరం మండలం, కత్తిపూడిలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతలు నిర్వహించారు.