BDK: ఆర్టీసీ బస్సు కండక్టర్‌కు గురువారం అకస్మాత్తుగా దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద గుండెపోటు వచ్చిందని స్థానిక ప్రయాణికులు తెలిపారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో స్థానిక పీహెచ్‌సికి తీసుకెళ్లగా కండక్టర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మరణించిన కండక్టర్ మధిరకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.