సత్యసాయి: చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న రామకృష్ణప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 20 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.