PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో( పీజీఆర్ఎస్ ) వచ్చిన రెవిన్యూ, ఇతర సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, హౌసింగ్, రీసర్వే తదితర అంశాలపై జేసీ రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.