SDPT: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో బాణసంచా విక్రయదారులు తప్పకుండా అనుమతి తీసుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వచేసిన, దుకాణాలను ఏర్పాటు చేసిన, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, పేలుడు పదార్థాల చట్టం 1884, రూల్స్-1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.