SRPT: పర్యావరణ పరిశుభ్రత అందరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హన్మంత రెడ్డి అన్నారు. పట్టణ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు భాగంగా శుక్రవారం స్థానిక 21వ వార్డులో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.