TG: కానిస్టేబుల్ హత్యకేసుపై నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన చేశారు. నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని వెల్లడించారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని స్పష్టం చేశారు. నిందితుడు రియాజ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని తెలిపారు. ఒక వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్ గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా, నిందితుడు రియాజ్‌ను ఎన్కౌంటర్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.