మహిళల ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ (109) శతకంతో అదరగొట్టింది. జోన్స్ (56) రాణించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీచరణి 2 వికెట్లు సాధించింది.