NLG: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి దివంగత ఎర్రోళ్ల విజ్జయ్య దశదినకర్మను ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు హాజరై నివాళులు అర్పించారు. మునుగోడు, నకిరేకల్, కోదాడ మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్ సంతాపం తెలిపారు.