PDPL:పెద్దపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి వేణుగోపాల్ బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం మొట్లపల్లి, కిష్టంపేట గ్రామపంచాయతీలను సందర్శించి, కార్యాలయ రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే, గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.