TG: రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్పోర్టు చెక్ పోస్టులు మూసివేయాలని DTOలకు ట్రాన్స్పోర్టు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల దగ్గర బోర్డులు, బారికేడ్లు తొలగించాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా మూసివేసి.. నివేదిక పంపించాలని తెలిపారు. అక్కడి సిబ్బందిని పునర్వినియోగం చేయాలన్నారు. చెక్ పోస్టుల రికార్డులను డీటీవోలకు తరలించాలని పేర్కొన్నారు.