BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో 126 ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం అని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవాని సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆడబిడ్డల చిరకాల ఇందిరమ్మ ఇల్లు అన్నారు.