MHBD: మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. గత 4నెలల నుంచి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కి లేఖ రాసినా స్పందన లేదని వాపోయారు.