BDK: బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కోతులు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు అదుపు తప్పి కింద పడినట్లు అన్నారు. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108కు సమాచారం అందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.