AP: నెల్లూరులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబసభ్యులకు మంత్రి నారాయణ పరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడి హత్య దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.