NLR: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ వింజమూరు మండలంలో పర్యటించారు. మండలంలోని గుండె మడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు.