నటుడు జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో నటి రమ్యకృష్ణ సందడి చేశారు. ‘నువ్వు చేసిన వాటిలో ఏ మూవీ మరోసారి చేయాలని అనుకుంటున్నావు’ అని జగపతి బాబు అడగ్గా.. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. తాను చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలని ఉందన్నారు. అంతేకాదు ‘బాహుబలి’లో శివగామిగా నటించేటప్పుడు నిజంగానే తను రాజమాతలా మారిపోయినట్లు తెలిపారు.