TG: హైదరాబాద్లో జంట జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు మరోసారి నిండాయి. ఈ రెండు జలాశయాలకు భారీగా ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల రెండు గేట్లు తెరిచి.. నీటిని కిందికి వదిలారు.