SRD: బంధం కొమ్ము రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.