కోనసీమ: కార్తీకమాసం సందర్భంగా రాజోలు RTC డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు DM జేమ్స్ కుమార్ తెలిపారు. అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు ఆలయాలకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. అక్టోబరు 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు.