AP: దుబాయ్‌లోని సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో CM చంద్రబాబు పాల్గొన్నారు. యూఏఈ దేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు ఈ రోడ్‌షోకు హాజరయ్యారు. ఏపీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను CM వివరించారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్రే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు.