SRCL: వేములవాడలోని భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి సామూహిక కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. రాజన్న దేవాలయంలోని సేవా సమితి సభ్యులు భక్తి గీతాలు, భజనలతో భక్తులను ఎంతగానో అలరించారు. కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని ఈ సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా జరిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు.