BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు కుంకుమార్చన, వైకుంఠ చతుర్దశి రోజున సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.