BDK: భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్కు టేకులపల్లి శాఖ గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణం చేపట్టాలని లైబ్రేరియన్ నాగన్న బుధవారం వినతిపత్రం అందజేశారు. టేకులపల్లిలో నూతన గ్రంథాలయం భవన నిర్మాణం చేపడితే మరింత మంది యువకులకు, నిరుద్యోగులకు స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పీవో సానుకూలంగా స్పందించారని తెలిపారు.