JGL: మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల రవి కుమార్తె హృదయశ్రీ(7) తీవ్ర జ్వరంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. పది రోజులుగా కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే హృదయశ్రీ మృతిచెందడంతో మల్యాల గ్రామంలో విషాదం నెలకొంది.