KDP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ నేపథ్యంలో, అధికారులు ఈ ఐదు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.