JGL: బీర్పూర్ మండలంలోని గోండు గూడెంలో దండారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గూడెంలోని ఆదివాసీలు ఏత్మాసర్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు చేసిన గుస్సాడీ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు జలపతి, భీమ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.