ASF: కాగజ్నగర్ మండలం రాస్పెల్లి పరిధిలోని గెర్రెగూడ సమీపంలో పులి సంచరించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గెర్రె గూడ గ్రామం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లే దారిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిజాడను గుర్తించేందుకు అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు చేశారు.